బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులను పట్టించుకోకపోవడంపై ఆ దేశంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బంగ్లాదేశ్ నుంచి దుస్తులు, జనపనార దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. జనపనార దిగుమతులను ముంబైలోని నవా షెవా ఓడరేవు ద్వారా మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఇతర భూ మార్గాలు లేదా సముద్ర మార్గాల ద్వారా అనుమతించబోమని స్పష్టం చేసింది.

