తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న
అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

