రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్కరోజులో తులం బంగారం ధర ఏకంగా రూ.8 వేల పైనే పడిపోయింది. నిన్న ఒక్కరోజే తులం బంగారంపై రూ.11 వేలు పెరిగితే, ఇవాళ ఏకంగా రూ.8 వేలు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం కావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపించింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.8,230 పతనమైంది. రూ.1,78,850 నుంచి రూ.1,70,620కి చేరుకుంది.

