ఫ్రాన్స్‌లోని పలు ఎక్స్ కార్యాలయాల్లో మంగళవారం అధికారులు సోదాలు నిర్వహించారు. ఆల్గోరిథమ్‌లో మార్పులు, పిల్లల అసభ్య చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా అధికారులు ఎక్స్‌కు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు చేశారు. గతేడాది జనవరిలోనే పారిస్ ప్రాసిక్యూషన్ సైబర్ క్రైమ్ విభాగం ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. ఎక్స్ కార్యకలాపాలు ఫ్రాన్స్ చట్టాలకు అనుగుణంగా ఉండాలన్నదే అభిమతమని పారిస్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

