
ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేసిన ప్రతిసారీ మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తప్పకుండా టాప్ 10లో ఉండేవారు. ఈసారి మాత్రం ఏకంగా 18వ స్థానానికి పడిపోయారు. కొంతకాలంగా రిలయన్స్ షేర్లు కుదేలవడమే అందుకు కారణం. అంబానీ రూ.7.85 లక్షల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 28వ స్థానంలో నిలిచారు. ప్రపంచంలో 3028 మంది బిలియనీర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.