తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టాప్ గేర్‌లోకి వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే BRS మాజీ MLAలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్‌గా బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని ఇటీవలే సుప్రీం కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

