
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు హైకోర్టు షాకిచ్చింది. అరెస్ట్ కాకుండా ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నాడు. అనారోగ్యం నేపథ్యంలో తాను ఇండియాకు రాలేనని.. తాను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాని ప్రభాకర్ పోలీసులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.