తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్ చాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నాలుగు సెక్టార్ల నుంచి 43 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది మొత్తం 3వేల 287 ఓట్లకు 1,417 మాత్రమే పోలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

