
బకాసురుడితో పోటీ పడుతూ తెలంగాణ భూముల్ని కాంగ్రెస్ నేతలు బుక్కపడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను కాంగ్రెస్ నేతలు బలవంతంగా తమ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్లో చదరపు గజం రూ.30 వేలు ఉంటే కాంగ్రెస్ నేతలు రైతులను బెదిరించి రూ.4- 5 వేలకే కొంటున్నారని తెలిపారు.