
సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు జరిగాయి. రోజు వేతనం 2 వేల లోపు ఉన్నవారికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. 3 విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం తెలిపారు. కాగా ఈ చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించలేదు కార్మిక ఫెడరేషన్. పర్సంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ ఒప్పుకోలేదు. 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తాం, నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ.. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలి. యూనియన్లను విడగొట్టేలా నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.