
హీరో విజయ్ దళపతి జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లేందుకు మధురై చేరుకున్న విజయ్ కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. “నా కారును ఎవరూ వెంబడించకండి. బైక్‌లపై వేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కార్యకలాపాలకు అభిమానులు పాల్పడవద్దు ” అంటూ రిక్వెస్ట్ చేశారు విజయ్. విజయ్ వేడుకున్నప్పటికీ అభిమానులు పట్టించుకోకుండా ఆయన వాహనాన్ని అనుసరించారు. అంతేకాకుండా విజయ్ వాహనంపైకి ఎక్కడానికి పలువురు ఫ్యాన్స్ ట్రై చేయగా.. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు మరింత కష్టతరంగా మారింది.