కర్నూల్ జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో నెల్లూరు జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వింజమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో రమేష్ (37) గోళ్ళ అనూష (32), మనీష్ (12) మణీత్వా (10) మృతిచెందారు. రమేష్ గత 15 ఏళ్లుగా బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కంపెనీ ట్రిప్పులో భాగంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాదు నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది.

