తెలంగాణలో ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల స్ట్రైక్ నాలుగు రోజులుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు “విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి..తమాషాలు చేస్తే తాటా తీస్తాం..
రాజకీయ పార్టీలతో అంటకాగుతూ బ్లాక్మెయిల్ చేస్తే ప్రభుత్వం సహించదు” అని సీఎం స్పష్టం చేశారు. కాలేజీలలో సౌకర్యాలు ఉన్నాయో లేవో తనిఖీలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు మాట్లాడకండి.. ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసని హెచ్చరించారు

