సంగారెడ్డి మండలంలోని తాళ్లపల్లి గ్రామ పంచాయతీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచిగా పోటీ చేసేందుకు ్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచి రిజర్వేషనేమో ఎస్సీకి రిజర్వు అయింది. తాను కొంతకాలంగా ప్రేమిస్తున్న యువతి ఎస్సీనే కావడంతో ఆమెను ఒప్పించి శనివారం పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయించాడు. అంతేకాకుండా అదేరోజు సాయంత్రం మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు.
పోలీస్ స్టేషన్కు చేరుకొని తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని పోలీసులకు వెల్లడించారు.

