కులాలు వేరు కావడంతో తన తండ్రి, సోదరుల చేతిలో చనిపోయిన తన ప్రేమికుడి మృతదేహాన్ని ఒక యువతి వివాహం చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కూతురి ప్రేమ సంబంధాన్ని వ్యతిరేకించిన తండ్రి, సోదరులు.. 25 ఏళ్ల సాక్షం టేట్ను కాల్చి, కొట్టి చంపారు. 21 ఏళ్ల ఆంచల్ మమిద్వార్, సాక్షం.. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాక్షం అంత్యక్రియలకు వచ్చిన ఆంచల్.. అతని మృతదేహాన్ని వివాహం చేసుకుంది. ఈ ఘటన స్థానికంగానే కాదు.. యావత్ దేశాన్నే కదిలిస్తోంది.

