అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అని, ఆయన విజన్ సాధన కోసం తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్న టీం-11 తీరుపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలను ఆయన ఇలా సెటైరిక్ గా చెప్పారు. ఇన్వెస్టర్లు ఏపీకి రావద్దంటూ ఈ-మెయిల్స్ పంపే స్థాయికి వారు దిగజారారని విమర్శించారు.

