
’లల్లాదేవి’ పేరుతో పలు కథలు, నవలలు రాసిన పరుచూరి నారాయణాచార్యులు (80) శుక్రవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. 1980 దశకంలో తెలుగు సాహితీ రంగంలో సుప్రసిద్ధులైన రచయితల్లో లల్లాదేవి కూడా ఒకరు. ఆయన రాసిన పలు నవలలు ముందు సీరియల్స్‌గా వచ్చాయి. చారిత్రక, జానపద, సాంఘిక రచనలు చేయడంతో ఆయన దిట్ట. తెలుగు సినిమాలకు కూడా రచయితగా ఆయన పనిచేశారు. ‘శ్వేతనాగు’. ఆయన రాసిన ఈ సంచలన నవల ఆధారంగానే దివంగత నటి సౌందర్య 100వ చిత్రం తెరకెక్కింది.