
‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’ విజేత మే 5న పవన్‌దీప్ రాజన్ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ సమీపంలో ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. కారు నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న క్యాంటర్ ట్రక్కును ఢీకొట్టింది. తాజాగా పవన్‌దీప్ కోలుకుని స్పృహలోకి వచ్చాడని వైద్యులు తెలిపారు. పూర్తిగా ప్రమాదం నుండి బయటపడ్డాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత పవన్‌దీప్ మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోను చూసిన లక్షలాది మంది అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.