
్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం మాట్లాడారు. సమర్థవంతమైన పాలన అందించే విషయంలో వారికి దిశా నిర్థేశం చేశారు. అందుబాటులో ఉండండి…. నిత్యం వారితో మమేకం అవ్వండి… అన్నింటికీ రూల్స్ కాదు… మానవీయ కోణంలో పనిచేయండి. అప్పుడే మీకు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.