
దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. 2017 పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఈ తీర్పు ఇచ్చినందున.. అంతకుముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని టీచర్లు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE వారి అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు తమ భవిష్యత్ గురించి కొత్త ఆందోళన చెందుతున్నారు.