
సోమవారం అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి శరత్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు కీలక సూచనలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఐఏఎస్ ఏ.శరత్ ఆయన కాళ్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.