బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియాలో పోస్టులు చేయడం నిషేధం, ప్రభుత్వ స్కీమ్స్, విధానాలు లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉద్యోగులు వ్యక్తిగత అభిప్రాయాలు పోస్టు చేయకూడదు, రీల్స్ లేదా లైవ్ స్ట్రీమ్ వంటి కార్యకలాపాలు పూర్తిగా నిషేధం,రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సపోర్ట్ ఇవ్వకూడదు. ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లు షేర్ చేయకూడదు.

