ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు. 8వ వేతనసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. రబీసీజన్‌లో రైతులకు రూ.38 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ ఇస్తునట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో ఆధునిక పద్దతులకు ప్రోత్సాహం ఇస్తునట్టు చెప్పారు.

