ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. ‘తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్’ ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల 10 శాతం సహకారంతో పాటు పెన్షన్ నిధికి అవసరమైన మొత్తం అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.

