దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం ప్రపంచ స్థాయి ఎఐ సదస్సుకు కనులపండువైన వేదిక అయింది. సోమవారం ఆరంభం రోజే లోనికి ప్రవేశించడానికి భారీ స్థాయిలో క్యూలైన్లు వెలిశాయి. పలు దేశాలకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీల అధినేతలు, ఎఐ రంగ నిపుణులు , విధాన నిర్ణేతలు , ఎఐ సంస్థల వ్యవస్థాపకులు , సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ ముందుకు వచ్చిన ఎఐ గురించి సరైన రీతిలో అవగావహనకు ఎక్కువగా యువతరం ఈ సమ్మిట్ తో కూడిన ఎక్స్‌పోకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపింది.

