అన్యాయమైన పద్ధతులు, వివక్ష, దోపిడీకి గురికాకుండా వినియోగదారులను రక్షించే లక్ష్యంతో ఏటా మార్చి 15న ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం<span;>’గా (World Consumer Rights Day) నిర్వహిస్తారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంతోపాటు వారి రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.