
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అర్మానీ మరణ వార్తను ఆయన ఫ్యాషన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించింది. ఫ్యాషన్ ఐకాన్ చిత్రాన్ని పంచుకుంటూ, సంస్థ ఇలా పేర్కొంది. అర్మానీ గ్రూప్ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, నిరంతర ప్రేరణ శక్తి అయిన సిగ్నర్ జార్జియో అర్మానీ మరణించారు.