ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను భారతదేశం నియంత్రిస్తుందని భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నారు. ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భారత జట్టు తన అధికారాన్ని ఉపయోగిస్తుందని చెప్పిన మాజీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను చాపెల్ కూడా సమర్ధించడం గమనార్హం. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్ మాట్లాడుతూ, గంగూలీ క్రికెట్ ఆడటానికి శ్రీలంకకు వెళ్లడానికి వీలుగా అతనిపై సస్పెన్షన్‌ను తగ్గించాలని మాజీ బీసీసీఐ, ఐసీసీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా అభ్యర్థించారని అన్నారు.

