
ప్రస్తుతం ప్రపంచ దేశాలు, టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పట్టు సాధించేందుకు భారీగా ఖర్చు పెడుతున్నాయి. అయితే తక్కువ ఖర్చుతో చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్, గ్లోబల్ టెక్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన ఏఐ కంపెనీ డీప్‌సీక్ భారీ సక్సెస్ అయింది. అమెరికా కంపెనీలకు సాధ్యం కాని ఫీట్‌ని ఇది సాధించడంతో టెక్ ఇండస్ట్రీ షాక్ అయింది. దీంతో ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులకు భారీ నష్టాలు తప్పలేదు