ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948లో, WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది. WHO స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుంది.

