
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్ జిపిటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాట్ జిపిటి వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం గత 20 నిమిషాలుగా వందలామాది చాట్ జిపిటి వినియోగదారులు తమ సమస్యలను రిపోర్ట్ చేస్తున్నారని తెలిపింది.