భారత స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచకప్ బాక్సింగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీ ఫైనల్లో నిఖత్ అలవోక విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ గనివా గుల్సెవర్‌తో జరిగిన పోరులో నిఖత్ 50తో అలవోక విజయం సాధించింది. అద్భుత పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన నిఖత్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పసిడి పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో 15 మంది భారత బాక్సర్లు స్వర్ణం కోసం పోటీపడనున్నారు.

