
పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్ రేటులో మూడు, డీజిల్ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ సమాధానాలు ఇచ్చింది.