Nvidia సంస్థ అరుదైన రికార్డును అందుకుంది. చరిత్రలోనే తొలిసారిగా ఐదు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ సొంతం చేసుకున్న తొలి కంపెనీగా ఘనత సాధించింది. భారత్ జిడిపి ఐదు ట్రిలియన్ డాలర్లు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే, భారత్, యూకే, జపాన్ దేశాల జిడిపి లను సైతం వెనక్కు నెట్టి ముందుకు దూసుకొని వెళ్ళింది. ఈ ఐదు ట్రిలియన్ డాలర్లను భారతీయ కరెన్సీలో మార్చినట్లయితే సుమారు 420 లక్షల కోట్లుగా చెప్పవచ్చు. CEO జెన్సెన్ హువాంగ్ సగర్వంగా ఈ ఘనతను ప్రకటించారు.

