
ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. నేడు తన కీర్తికిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. చైనాకు చెందిన సీపీసీ ఇప్పటివరకూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉండగా.. కమలం పార్టీ దాన్ని అధిగమించింది. 14 కోట్ల సభ్యత్వాలతో కొత్త చరిత్ర లిఖించింది. శత వసంతాల కాంగ్రెస్ పార్టీతో సాధ్యంకానిది బీజేపీ సాధ్యంచేసింది.