బీహార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల అమన్ తివారీతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ కుట్ర కోసం అమన్ తివారీ అమెరికా గూఢచార సంస్థ అయిన సీఐఏకు ఒక ప్రతిపాదన పంపించి, ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరాడు. ఈ సమాచారం అందిన వెంటనే, నిఘా సంస్థలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.

