కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి వివరించారు.

