
టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్ ఎక్స్ సీఈవో, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ భారత్ సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అభిమానిని అనుచెప్పుకునే మస్క్ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివర్లో భారత్ సందర్శించడానికి తాను ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా మస్క్ తన X ఖాతా పోస్ట్‌లో పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనయా యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా మస్క్ పరిగణించబడుతున్న సంగతి తెలిసిందే.