దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు పైగా దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

