జైన సాధు మహారాజు జయంతి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సభ నేపథ్యంలోనే జైన అత్యున్నత మండలి ప్రధాని మోడీకి ధర్మ చక్రవర్తి పురస్కారం అందించారు. ధర్మనిబద్ధతత పాటించే పాలకులకు , ధర్మ పరిరక్షణ సంకల్పం కల్గిన వారికి ఈ బిరుదు ప్రసాదించడం జరుగుతుంది. ఈ విశిష్ట పురస్కారానికి తాను అర్హుడినని తాను భావించడం లేదని, అయితే సాధువులు బహుకరించే వాటిని దివ్య ప్రసాదంగా స్వీకరించడం భారతీయ సంస్కృతి, ఈ క్రమంలోనే ఈ గౌరవాన్ని తాను ప్రసాదంగా తీసుకుంటున్నానని తెలిపారు.

