దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూపై పదేపదే ప్రధానమంత్రి, బీజేపీ విమర్శలు చేస్తుండటంపై ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో దాదాపు అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. ఆయన (నెహ్రూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ను ప్రారంభించకుంటే మీరు మంగళ్‌యాన్ చేపట్టి ఉండేవారు కాదు. ఆయన డీఆర్‌డీఓ ఏర్పాటు చేయకుంటే తేజస్‌లు ఉండేవి కావు అని ప్రియాంక అన్నారు.

