
కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయ్ నివారణకు ఈగల్ బృందాలు ఏర్పాటు చేసి కట్టడి చేశామని చంద్రబాబు చెప్పారు. కల్తీ మద్యం నివారణ దిశగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ను అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రతీ మద్యం బాటిల్‌పై ఉండే లేబుల్‌ని స్కాన్ చేయటం ద్వారా మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ రూపకల్పన చేశామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఉత్తమ విధానాలు అందుబాటులోకి తెచ్చామన్నారు చంద్రబాబు.