
తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం జాతీయ, రాష్ట్ర రహదారుల తరహాలో నాణ్యమైన రోడ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా.. తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో రాష్ట్రంలోని మండల కేంద్రాలను, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానిస్తూ మొత్తం 17,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీ కంపెనీలు ఇప్పటికే 4,000 కిలోమీటర్ల పరిధిలో సర్వే పూర్తి చేశాయని తెలిపారు.