
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులను అడ్డుకోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని సూపర్‌సిక్స్ హామీల గురించి ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారని దుయ్యబట్టారు.