తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టు కీలక నేతలుప్రసాదరావు అలియాస్ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ సరెండర్ అయ్యారు. అనారోగ్య పరిస్థితులు.. ఆపరేషన్ కగార్ వల్ల తాము లొంగిపోయామని మావోయిస్టులు చెప్పారు. రేవంత్ సూచనాలతోనే జనజీవన స్రవంతిలోకి వస్తున్నామన్నారు. అయితే ఇది లొంగుబాటు కాదు.. రాబోయే రోజుల్లో ప్రజల కోసమే వస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఎలాంటి డబ్బులు ఆశించడం లేదన్నారు. చాలా మంది చనిపోయారు.. మా సిద్ధాంతం మేరకు ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు.

