
మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే యాక్ట్ చేస్తారా అంటే.. నాకు ఇబ్బంది లేదని చెప్పాను. నేను ఒకటే కోరుకున్నది ఏంటంటే.. సెట్లో పాలిటికల్ టాపిక్‌లు పెట్టొద్దని చెప్పాను. ఆయన ప్రొఫెషనల్‌గా ఉంటే.. నేనూ ప్రొఫెషనల్‌గా ఉంటాను.మా మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. ప్రకాష్ రాజ్ బ్రిలియంట్ యాక్టర్. మా మధ్య ఏమైనా ఉంటే అవి వేరే చోట మాట్లాడుకుంటాం కానీ.. ఇక్కడ కాదు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అన్నారు పవన్ కళ్యాణ్.