పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, IFMIS పోర్టల్ లో ఇతరుల పేర్లను చేర్చారు. నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో
నకిలీ ఖాతాలు తెరిచి తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు సుమారు రూ. 1,40,18,308 మేర ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందారు. SP ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసు ఉద్యోగిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

