
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ఏపీ పోలీసులపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కౌంటర్ ఇచ్చారు. పోలీస్ యూనిఫాం మే కష్టపడి సాధించాం అని చెప్పుకొచ్చారు. మేం తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని ఎస్పీ రత్న వెల్లడించారు. తాము ఎవరికీ అనుకూలంగా పని చేయలేదు అని ఎస్పీ రత్న వివరణ ఇచ్చారు.