
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయి ఒక పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారు. బెళగావి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రసంగించడానికి ముందే బీజేపీ మహిళా మోర్చా సభ్యులు నల్ల జెండాలతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కారణంగా, ప్రసంగానికి అడ్డంకి ఏర్పడింది. సభా బాధ్యతలు చూస్తున్న పోలీసు అధికారి, ASP భరమణిని పిలిచి దురుసుగా ప్రవర్తించారు. సిద్ధరామయ్య తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక, చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి,