
పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ శాఖకి సమాజంలో ఎప్పుడూ గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఇకపై నేరస్థులపై కఠినంగా ఉండాలని శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి ప్రజలకి అండగా ఉండాలని, అలానే ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. పోలీస్ల త్యాగాలు, బలిదానాల స్ఫూర్తితో కొనసాగుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.